చావు కబురు చల్లగా

Chaavu Kaburu Challaga Review; భర్త చావు తో ఆమె జీవితాన్ని ఇంటి గడప వద్దనే ఆగిపోకూడదు 

Chaavu kaburu Challaga Cast & Crew

Starring; Karthikeya, Lavanya Tripathi, Aamani  

Director; Koushik Pegallapati

Music Director; Jakes Bejoy

Cinematography; Karm Chawla

Producers: Bunny Vasu, Allu Aravind

Release Date; 19 March 2021

Ratings; 2.5/5

2.5/5
chaavu kaburu challaga

కథ

బస్తి బాలరాజు ( Karthikey ) అంతిమ యాత్ర అంటే శవాలను కాటికి తీసుకెళ్లే వాహనం నడిపే డ్రైవర్.

అతని తో వాళ్ళ అమ్మ గంగమ్మ్మ ( Aamani ) మరియు నాన్న కలిసి ఉంటారు .

ఒక రోజు బాలరాజు పీటర్ శవం తీసుకెళ్లాడని వెళ్తాడు అక్కడే మల్లికను ( Lavanya Tripati ) చూస్తాడు.

కానీ…

మల్లి క చనిపోయిన పీటర్ భార్య !

అది తెలిసి కూడా బాలరాజు మల్లిక కు వెళ్లి తన ప్రేమ విషయం చెపుతాడు,అది కూడా పీటర్ శవం అంతిక్రియలో.

మల్లిక అతని ప్రవర్తన చూసి అసహించుకుంటుంది,అయిన సరే బాలరాజు మాత్రం మల్లిక వెంట పడుతాడు. మల్లిక ఒప్పుకుంటే పెళ్ళిచేసుకుంటే అంటడు.

మరోవైపు బాలరాజు అమ్మ గంగమ్మ కు మెకానిక్ మోహన్ అంటే ఇష్టం, గంగమ్మ ఒప్పుకుంటే పెళ్లిచేసుకుంటా అంటడు మోహన్. గంగమ్మ కు కొడుకు బాలరాజు మరియు మంచాన పడ్డ మొగుడు ముఖ్యం అని మోహన్ కు నో చెపుతుంది.

మరి..

మల్లిక బాలరాజు ప్రేమను ఒప్పుకుందా ?

బాలరాజు మల్లిక ను పెళ్ళిచేసుకున్నాడా ? 

మల్లిక అత్త మామ కూడా ఒప్పుకున్నారా ?

గంగమ్మ కు మోహన్ తో  బాలరాజు మళ్లి పెళ్ళిచేస్తాడు ?

పై వాటి సమాదానాలు తెల్వాంటే….Chaavu Kaburu Challaga చుడండి.

విశ్లేషణ

చావు కబురు చల్లగా కథ లో….

ఒక మంచి పాయింట్ ఉంది. మన దేశం లో మరి ముక్యంగా తెలుగు రాష్ట్రాలలో అమ్మాయి లు పెళ్లి చేసుకున్నాక భర్త చనిపోతే అమ్మాయిల పరిస్థితి దారుణంగా ఉండేది. ఇపుడు కొద్దిగా మార్పు వచ్చింది అనచ్చు, పిల్లలు అయ్యాక భర్త పోతే భార్య అంతే ఇక, అలానే ఉండాలి, కానీ భార్య పోతే భర్త మాత్రం ఇంకో పెళ్ళికి ఒకే అంటాడు. 

ఇక్కడ సరిగా సమాజం లోని సమస్యను బాగా తీసుకోని చూపెట్టాడు అనాలి. కానీ మన ప్రేక్షుడు ఇంకా అలవాటు పడలేదేమో అందుకే సినిమా పెద్ద గ ఆడలేదు .

లేదా డైరెక్టర్ తీసుకున్న పాయింట్ కరెక్ట్ కాని…కథను మరియు అందులోని పాత్రలను నడిపించే విధానం లో ఏదైనా పార్ములా మిస్ అవ్వచ్చు .

jaya janaki nayaka లో కూడా ఇలాంటి కథ కానీ అక్కడ లవ్ చేసిన వ్యక్తి తో కాకుండా ఇంకోరితో పెళ్లి అవుతుంది, అతను చనిపోయాక మల్లి ప్రేమించిన హీరో తో పెళ్లి తో అవుతుంది.

కానీ…ఇక్కడ 

భర్త చనిపోయాక లవ్ స్టార్ట్ అవుతుంది అంతే .

డైరెక్టర్ ఇంకొద్దిగా కథ మరియు పాత్రల సృష్టి ల పై దృష్టి పెట్టాల్సింది.

అంటే…

హీరో పాత్ర గొప్పగా ఉంటె ఆ పాత్ర సమాజానికి ఆదర్శం  అవుతాడు అంటే అంబానీ మనవడు వాళ్ళ ఇంట్లో పని చేసే పని మనిషి కూతురు ని పెళ్లి చేసుకున్నట్టు.

లేదా …..

హీరో పాత్ర కూడా హీరోయిన్ కి తగ్గట్టు ఉండాలిసింది .

మొత్తానికి మంచి సినిమా అని మాత్రం అని చెప్పాలి .డైరెక్ట్ కి నిర్మాతలకి మెచ్చుకోవాలి ఇలాంటి కథను సినిమా తేవడానికి .

కెమెరామ్యాన్ మరియు మ్యూజిక్ కూడా బాగుంది , ఎడిటర్ పనితనం కనిపిస్తుంది.

Aha లో సినిమా విడుదల చేసారు చుడండి .

For More Reveiws 

11th Hour రివ్యూ
తెల్లవారితే గురువారం రివ్యూ