అరణ్య మూవీ రివ్యూ

అరణ్యంమూవీ; జంతువులను కూడా మనుషులాగే బ్రతకనివ్వండి అని చెప్పే కథ 

అరణ్యం మూవీ

Starring; Rana Daggubati

Director; Prabhu Solomon

Music Director; Shantanu Moitra

Cinematography; A. R. Ashok Kumar

Release Date;26 March 2021

Ratings; 3/5

3/5
అరణ్య మూవీ రివ్యూ తెలుగు

అరణ్య మూవీ

అరణ్య మూవీ బందేవ్(Rana Daggubati ) అలియాస్ ఫారెస్ట్ మాన్ మరియు ఏనుగుల కథ తెలియజేస్తుంది.

బందేవ్ అడవిలో తన చిన్నపట్టి నుండి తిరుగుతూ ఏనుగుల బాగోగులు చూస్తూంటాండు, తన తాత కి ఇచ్చిన మాట కోసం. నిజానికి ఆ అడవి మొత్తం బందేవ్ వాళ్ళ తాతది ,అతను దాని గవర్నమెంట్ కి దానం చేస్తాడు. 

ఆలా బందేవ్  ఏనుగులు మరియు అక్కడి మొక్కలను చూసుకుంటూ బ్రతుకుంటుంటాడు. ఇంతలో అక్కడ township కట్టడానికి మినిస్టర్  Kanakamedala Raja Gopalam (Anant Mahadevan) ప్లాన్ చేస్తాడు. దానికి బందేవ్ అడ్డుకుంటాడు .

అక్కడ township వాళ్ళ అడవి అంతరించిపోతాది అని మరియు అనేక జీవరాశులు చనిపోతాయి అని పైగా ఇది మా తాత ఆస్తి అని ఇది కేవలం అడవిన్నీ పెంచడానికే తప్ప ఇక్కడ township ఒప్పుకోను అని ఎదురుతిరుగుతాడు.

మినిస్టర్ అతని పవర్ తో బందేవ ను జైలు కు పంపుతాడు , అక్కడ 60km గోడ కట్టుతాడు దాని వల్ల ఏనుగులకు నీళ్ల ఇబ్బంది వస్తుంది , ఎందుకంటే అక్కడే ఒక నీటి నిల్వ ఉంటది,ఏనుగులు అక్కడి వచ్చి నీళ్లు తాగుతూ ఉంటాయి , కానీ ఎపుడు ఇ గోడ వల్ల ఏనుగులకు నీళ్ల ఇబ్బంది ఎదురు అవుతుంది.

బందేవ్ గోడ ని గోడని తొలగించడా లేదా ? ఏనుగుల నీళ్ల సమస్య తిరందా లేదా ? మినిస్టర్ గెలుస్తాడా లేక బందేవ్ గెలుస్తాడా తెలుసుకోవాలి అంటే!

అరణ్యం మూవీ చుడండి 

అరణ్యం మూవీ విశ్లేషణ

అరణ్యం కథ లోకి వస్తే రానా దగ్గుబాటి చాల బాగా యాక్ట్ చేసాడు అని చెప్పాలి.కొన్ని సంవత్సరాల నుండి అడవిలో బ్రతికే మనిషి లాగా అతని ఆహార వేవహారాలు అన్ని బాగా చేసాడు ,మాట్లాడేవిధానం , నడిచే విధానం అన్ని బాగా చేసాడు.

మిగితా పాత్రలు ఇలా వచ్చి ఆలా పోతాయి , ఒక పాత్రికేయురాలు మాత్రం లీడ్ రోల్ అని చెప్పాలి కానీ అంతగా ప్రాముక్యత ఉండదు.

అడవిలో కథ కాబట్టి నక్సల్ అంశం చూపెట్టాడు తప్ప , దానికి కథకు ఎం సంబంధం ఉండదు .

director Prabhu Solomon ఇంతకు ముందు కూడా ఇలాంటి కథలు తీసాడు , గజరాజు కూడా ఏనుగుల మీదే కథ నడుస్తుంది.

కానీ ఎక్కడో కథ మిస్సయ్యాడు అనిపిస్తుంది, కేవలం ఏనుగులకు నీళ్ల సమస్య మీదనే కథ నడుస్తుంది, చూడడానికి కొంత సిల్లీగా అనిపిస్తుంది. నీళ్ల సమస్య చిన్నది అని నా  ఉద్దేశం కాదు.

అంత పెద్ద స్టార్ ఆక్టర్ అండ్ యాక్ట్రెస్ ఉన్నపుడు ఇంక budget కూడా ఉన్నపుడు అడవిలో ఇంకా చాల సమస్యలు ఉన్నాయి , యురేనియం తవ్వకాలు , అడవుల నరికివేత , ఇంకా అక్కడ నివసించే జాతుల సమస్యలు ఆలా చాల ఉన్నాయి.కానీ మొత్తానికి బాగా తీసాడు కానీ కథ మాత్రం లేదు.

cameraman కచ్చితంగా మెచ్చుకొని తీరాలి, visuals ఇంత బాగా కనిపిస్తునాయి అంటే దానికి అతనే కారణం కాబట్టి.

మిగితా ఆక్టర్స్ అందరు బాగా నటించారు అని చెప్పాలి,మినిస్టర్ కూడా బాగా చేసాడు, నక్సల్స్ పాత్రలు మరియు జర్నలిస్ట్ పాత్రలు బాగా చేసారు.

మొత్తానికి Director Prabhu Solomon మిగితా డైరెక్టర్ ల కాకుండా విభిన్న కథలు ఎంచుకుంటాడు, అందుకు అతన్ని మెచ్చుకోవాలి .

జంతువుల ప్రేమికులు మరియు కొద్దిగా ఓపిక తో ఉండే వాలు సినిమా చూడవచ్చు .

Aranya Movie English Review